చైనాలో పెను విషాదం చోటు చేసుకుంది. శనివారం జరిగిన మారథాన్ లో పాల్గొనడానికి వచ్చిన 21 మంది ఆల్ట్రా మారథాన్ రన్నర్లు గాలివాన సృష్టించిన భీకరానికి మృతి చెందారు. గాన్జు ప్రావిన్సులోని యెల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్ కొండప్రాంతంలో మారథాన్ ఏర్పాటు చేయగా ఇందులో 100 కి.మీ క్రాస్ కంట్రీ మౌంటెన్ రేస్ లో 172 మంది పాల్గొనగా, ఒక్కసారిగా వాతావరణంలో తీవ్ర ప్రతికూలత ఏర్పడి నిముషాల కాలంలో పెను విధ్వసం తో గాలి వీచి వర్షం కురవడంతో అథ్లెట్లు తీవ్ర గాయాల పాలు కాగా హుటాహుటిన 1200 మంది రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి 151 మందిని కాపాడగ 21 మంది చనిపోయారు.