ప్రకాశం జిల్లా : ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే డాక్టర్లు మాత్రం మానవత్వం మరిచి ప్రజల్ని దోచుకుంటున్నారు. కరోనా పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలు మనం చాలా చూశాం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్లు సైతం పక్కదాది పట్టించి అమ్మకుంటున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.ప్రకాశం జిల్లా అద్దంకిలో ఓ ఏఎన్ఎమ్ వ్యాక్సిన్లను దారిమళ్లిస్తుంది. అద్దంకి మండలం మోదేపల్లి ఆసుపత్రిలో పద్మావతి అనే మహిళ ఏఏన్ఎమ్గా విధులు నిర్వర్తిస్తుంది.గ్రామంలో ప్రజలకు వేసేందుకు తనకు ఇస్తున్న వాక్సిన్ ను అక్రమంగా దారి మల్లించి తన ఇంట్లోనే డబ్బులు తీసుకుని పలువురికి వ్యాక్సిన్ వేస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకన్న జనం ఏఎన్ఎమ్ ఇంటికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల వ్యక్తులు తరలివస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర కూడా కోవిషీల్డ్ ఉంది..కానీ సదరు ఏఎన్ఎమ్ దగ్గర అందుబాటులో లేని కోవ్యాగ్జిన్ టీకాను కూడా వేస్తుంది. ఇంటి వద్ద వ్యాక్సిన్ వేసేందుకు పద్మావతి భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత వ్యవహారం జరుగుతున్న జిల్లా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నా రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉంది.కానీ ఈ ఏఎన్ఎమ్ దగ్గరకు వెళ్తే మాత్రం నిమిషాల్లో వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.మరి ఇలా అక్రమంగా టీకాలు వేస్తున్న ఈ ఏఎన్ఎమ్పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.