జూన్ 1 2021 అయిపాయ్... జూన్ 1 2022 కి డెడ్ లైన్ పెట్టిన ఏపీ మంత్రిగారు...!

ఈరోజు పోల‌వ‌రం ప‌నుల‌ను ఏపీ ఇరిగేష‌న్ మంత్రి అనిల్ కుమార్ య‌ద‌వ్ ప‌రిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 15వ తారీకు నుండి స్పిల్ వే రివర్స్ స్లూయిజ్ ద్వారా గోదావరి నీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గోదావరి వరద వచ్చేనాటికి నీటి మళ్లింపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన‌ట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దీనిపై పూర్తిగా దృష్టిపెట్టి పనులు చేయిస్తున్నారని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ళు ఎటువంటి పనులు చేయలేదని.. చంద్రబాబు సర్కారు హయాంలో కాపర్ డ్యాంను నాణ్యాతాలోపంతో నిర్మించడం వలనే డయాఫ్రం వాల్ దెబ్బతిన్న‌ద‌ని వ్యాక్యానించారు. ఇవేమీ పట్టనట్లుగా టీడీపీ నేతలు ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా పోయిన ఏడాది ఖ‌రీఫ్ వ‌ర‌కు పోల‌వ‌రం ప్రాజ‌క్టు ద్వారా నీరిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు మ‌ళ్లీ వ‌చ్చేఏడాదికి డెడ్లైన్ పెట్టారని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: