నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంతకి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్కడి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో పదో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,దర్శకుడు ఆర్జీవిని ఇంటర్వూ చేసింది.ఆ ఇంటర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంటర్వూ చేసిన తరువాత అరియానా, ఆర్జీవీ ఇద్దరు అదే జిమ్‌లో వర్కవుట్స్ చేసినట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు