ప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఆయన మృతితో తెలుగు సాహితీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రచయితలు, కవులు, కళాకారులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీటి నివాళి అర్పిస్తున్నారు.
ఆయన మరణానికి సంబంధించి చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ''తన అద్భుతమైన కథలతో..తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రముఖ రచయత కాళీపట్నం రామారావుగారు మృతి చెందడం తెలుగు సాహితీ రంగంలో పూడ్చ లేని లోటు. కథానిలయం స్థాపించి తెలుగు కథకు ఆయన చేసిన సేవ అజరామరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.