డైలాగ్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తరవాత హీరోగా నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ విషయానికి వస్తే సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దాంతో డైలాగ్ కింగ్ యాక్షన్ చిరు డైలాగ్ లతో టీజర్ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా టీజర్ లో చిరు మోహన్ బాబు మాడ్యులేషన్ లో నా రూటే సపరేటు అని చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అంతే కాకుండా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఫసక్ అనే డైలాగ్ కొట్టి ట్రోల్స్ కు గురైన మోహన్ బాబు తన డైలాగ్ ను తానే చెప్పడం టీజర్ లో మరో హైలెట్ గా నిలిచింది. ఇక టీజర్ చూస్తుంటే మాత్రం డైలాగ్ కింగ్ ఈ సారి హిట్ కొట్టడం ఖాయమనే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.