ఏపీ ముఖ్యమంత్రి జగర్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన లో పోలవరం ప్రాజెక్ట్...రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రమంత్రులతో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా వ్యాక్సిన్ పై కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సీఎం జగన్ వ్యాక్సిన్ పై లేఖ రాసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ల లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందుల విషయంలో అన్ని రాష్రాల ముఖ్యమంత్రులం ఒకే మాట మీద ఉందామని జగన్ లేఖ రాసారు. వ్యాక్సిన్ కు గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ కూడా రాలేదన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.