నేటి నుండి కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నారు. అయితే ఆనందయ్య మందు పొందడం అంటే సులభం కాదు. మందు పంపిణీకి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆనందయ్య మందును మొదట సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇవ్వనున్నారు. ఆ తరవాత ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ముందు తీసుకునేవారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకుని రావాలని కండిషన్ పెట్టారు. రోజుకు నాలువేల మందికి మందు పంపిణీ చేయాలని భావించారు కానీ రోజుకు 2వేల మందికి సరఫరా చేయడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమని తెలుస్తోంది.