కడప : ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. ఏడు నెలల తరువాత నేడు మళ్లీ విచారణను సీబీఐ ప్రారంభించింది.కడపలో విచారణ చేస్తున్న సమయంలో సీబీఐ అధికారలు కరోనా బారిన పడటంతో విచారణను తాత్కాలికంగా ఆపేశారు. మళ్లీ ఈ రోజు నుంచి విచారణను వేగవంతం చేస్తున్నారు. కడస సెంట్రల్ జైలు కేంద్రంగా నేడు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు.