తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో సంప్రదింపులు కూడా జరిపారట. త్వరలోనే ఎల్.రమణను మంత్రి ఎర్రబెల్లి కలవనున్నారు. ఇప్పటికే రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణకు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ బంపరాఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవిని రమణకు ఇవ్వనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో ఎల్.రమణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగానే ఆయన కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు రమణతో పాటు మరికొందరు టీటీడీపీ నాయకులు కూడా టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది.