ఈ రోజు (గురువారం) సూర్య గ్రహణం ఏర్పడనుంది. అంతే కాకుండా ఈ ఏడాది ఇదే తొలి సారి సూర్యగ్రహణం ఏర్పడటం విశేషం. వలయాకార సూర్యగ్రహణం కనిపించనుంది. భూమి నుండి చంద్రుడు దూరంగా ఉంటాడు కాబట్టి వలయాకారంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. దాంతో చూంద్రుడి చుట్టూ వలయాకారంగా ప్రకాశవంతంగా వెలుగు కనిపిస్తుంది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, లఢక్ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపించనుంది.
అంతే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యాస్తమయానికి ముందు ఈ సూర్యగ్రహణాన్ని చూడచ్చు. మరోవైపు రష్యా,గ్రీన్ ల్యాండ్, కెనడా దేశాల్లో మాత్రం ఈ సూర్యగ్రహణాన్ని సంపూర్ణంగా చూడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇక గ్రహణం భారత్ పై ఎంలాంటి ప్రభావం చూపిస్తుందా అని కొందరు అనుకుంటారు కానీ మన దేశంపై గ్రహణ ప్రభావం ఏమీ ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి నిభంధనలు పాటించాల్సినవసరంలేదని అంటున్నారు.