ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్. ఈ వెబ్ సిరీస్ ను విద్యా సాగర్ తెరకెక్కించారు. అంతే కాకుండా బాషా సినిమా దర్శకుడు సురేష్ కృష్ణ ఈ సిరీస్ ను నిర్మించాడు. ఈ సిరీస్ లో బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ నటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను కోలీవుడ్ హీరో కార్తీ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ట్రైలర్ లో ప్రియదర్శి కామెడీ టైమింగ్, నటన ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. అంతే కాకుండా వెబ్ సిరీస్ లోని డైలాగులు రియలిస్టిక్ గా ఉన్నాయి. నందినీ రాయ్ నటన మరియు ప్రియదర్శి పర్ఫామెన్స్ ఈ ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా జూన్ 18 నుండి ఈ వెబ్ సిరీస్ అల్లు వారి ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.