అన్నంత పని చేసిన ఈటెల... ఈటెలతో పాటు చేరింది ఎవరు...?

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటల రాజేందర్ అన్నంత పని చేశారు. ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈటెల తో పాటు మాజీ ఎంపి రమేష్ రాథోడ్ ,
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ , తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.

చేరికల కార్యక్రమానికి  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ , పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్ , సోయం బాపురావు ,  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఈటల బృందం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్ళనునుంది. ఈటెల తో పాటు వచ్చిన ఇతర అనుచరులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పనున్నారు. పార్టీ నేతలందరికీ కిషన్ రెడ్డి తన నివాసంలో లంచ్ ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: