బ్రేకింగ్ : తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్..!

వేముల ఘాట్ లో ఆత్మహత్యకు పాల్పడిన మల్లారెడ్డి మృత దేహాన్ని సిద్దిపేట మార్చురీ లో సందర్శించిన‌ ర‌ఘునంద‌న్ రావు మృతుడి స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.  ఈ సంద‌ర్భ‌గంగా ర‌ఘునంద‌న్ రావు ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు కురిపించారు. మల్లారెడ్డి గ్రామంతో , తన ఇంటి తో ఉన్న అనుబంధాన్ని తెంచుకొలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పారు.


రైతు తన చితి తానే పేర్చుకొని తనను తాను సజీవదహనం చేసుకున్నాడాంటే మనం కట్టే ప్రాజెక్ట్ లు , అభివృద్ది అంతా డొల్లేన‌ని వ్యాఖ్యానించారు. సిద్దిపేట పర్యటనకు వచ్చే సీఎం కెసిఆర్ మల్లన్న సాగ‌ర్ బాధితుల తో మాట్లాడాలన్నారు. ఇదిలా ఉండగా పరామర్శ అనంతరం ఎమ్మెల్యే వేములవాడ ఘాట్ కు బయలుదేరగా పోలీసులు అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: