కోహ్లీకి ఉన్న నమ్మకం విలియమ్సన్ కి లేదా...?

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ విషయంలో క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మ్యాచ్ విషయంలో ఎన్నో అంచనాలు, ఆటగాళ్ళ బలాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఫాన్స్ లో ఉత్కంట పెంచుతుంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఒక విషయం హాట్ టాపిక్ అయింది. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు స్పిన్నర్లను తీసుకోగా న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఒక స్పిన్నర్ ని కూడా జట్టులో తీసుకోలేదు.

ఇండియాకు అశ్విన్, జడేజా ఇద్దరూ ఆల్ రౌండర్ లు అలాగే స్పిన్నర్లు కూడా... ఈ ఇద్దరికీ బౌలింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉండటం, మ్యాచ్ ని మలుపు తిప్పే సామర్ధ్యం ఉండటంతో వాళ్ళ మీద నమ్మకంతో తీసుకున్నాడు. ఫాస్ట్ పిచ్ అయినా వాళ్ళ అనుభవాన్ని నమ్మాడు. అయితే కివీస్ జట్టులో అంత సామర్ధ్యం ఉన్న స్పిన్నర్ లు లేకపోవడంతో విలియమ్సన్ వెనక్కు తగ్గినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: