కర్మ: లైన్ లో పడ్డాడులే అనుకుంటే దొరికేసిన రహానే
ఇక రహానే నిలబడ్డాడు అనుకునే లోపు వికెట్ కోల్పోయాడు. అర్ధ సెంచరీ ముంగిట వికెట్ చేజార్చుకున్నాడు. మంచి ఫోర్ లు కొడుతూ దూకుడు మీదున్నట్టు కనిపించాడు. కీవీస్ బౌలింగ్ విభాగం మీద ఎదురు దాడి మొదలుపెట్టి వాగ్నర్ బౌలింగ్ లో వికెట్ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం ఇండియా 182 పరుగులకు 6 వికెట్ లు కోల్పోయింది. అశ్విన్, జడేజా క్రీజ్ లో ఉన్నారు. రహానే 49 పరుగులకు అవుట్ అయ్యాడు.