మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా ఈ నెల 28న ఆయన కాంస్య విగ్రహాన్నిముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డును ఇప్పటికే పివిఎన్ఆర్ మర్గ్ గా ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ మార్గం ప్రారంభంలోనే పీవి నరసింహారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇక ఈ విగ్రహం మొత్తం 16 అడుగుల ఎత్తులో ఉండనుండగా సుమారుగా 2 టన్నుల బరువు ఉండనుంది. అంతే కాకుండా ఈ విగ్రహం తయారీలో 85శాతం కాపర్, 5శాతం జింక్, 5శాతం లెడ్ ను ఉపయోగించారు. భారీ మొత్తంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహంతో నెక్లెస్ రోడ్డుకు కొత్త వైభవం రానుంది. ఇదిలా ఉండగా తెలుగు నేపపై పుట్టిన పీవీ నరసింహారావు ప్రధానిగా ఎదిగారు. అంతే తెలుగు జాతి అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు.