జగన్ ను వదలని తెలంగాణా మంత్రులు, ఇవాళ మరొకరు...!

ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణాగా మరోసారి నీటి వివాదం మారుతుంది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సిఎం వైఎస్ పై తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు చేసారు. ఏపీ సిఎం జగన్ దౌర్జన్యంగా ఆర్డీఎస్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ నీళ్ల వాటా కోసం న్యాయ పోరాటం చేస్తాం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

జగన్ దిగిరాకపోతే ప్రజా ఉద్యమం తప్పదు అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే  విషయంలో టీఆర్ఎస్ కంటే పెద్ద పార్టీ మరోటి లేదు అని ఆయన స్పష్టం చేసారు. జగన్ కు తెలియకపోతే కేసీఆర్ సలహా కూడా ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే అవకాశం జగన్ కు ఇవ్వం అని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: