క‌రోనా అప్డేట్..నిన్న గుడ్ నేడు బ్యాడ్ న్యూస్.. !

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న దేశంలో 35000 కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నేడు  45,951  కొత్త కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా  60,729 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ఇక నిన్న దేశంలో తొమ్మిది వందల మంది మృతి చెందగా ఈరోజు 817 మంది మ‌హ‌మ్మారి కార‌ణంగా మరణించారు. అయితే నిన్న 35 వేల కేసులు నమోదు అవడంతో అంతా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ఇది శుభ పరిణామమని అనుకున్నారు.

కానీ మళ్లీ ఈరోజు కేసుల సంఖ్య ఒక్క‌సారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వైద్య అధికారులు మాత్రం ఇంకా పూర్తిగా క‌రోనా తగ్గలేదని జాగ్రత్తలే శ్రీరామరక్ష అని చెప్తున్నారు. కానీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ను ఎత్తి వేశారు. దాంతో ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. లాక్ డౌన్ ను మర్చిపోయారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: