కేసీఆర్ హిట్లర్.. ఏపీ బీజేపీ నేత ఫైర్.. !

ఏపీ తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా తాజాగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఆంధ్ర రైతుల కడుపుమంటతో ఉద్దేశపూర్వకంగా నీళ్లను సముద్రంలోకి మరణించిన చరిత్ర మీకే దక్కుతుంది కేసీఆర్ దొరగారు అంటూ మండిపడ్డారు. పులిచింతల లో తెలంగాణ జెన్ కో అసందర్భంగా.. దౌర్జన్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన కారణంగా 7400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తోందన్నారు.


దాంతో ప్రకాశం బ్యారేజి ద్వారా 8,600 క్యూసెక్కుల నీరు గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వృధాగా పంపుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ కేవలం ఆంధ్ర రైతులకు మాత్రమే అన్యాయం చేయలేదని దేశంలోని రైతులందరికీ అన్యాయం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ ను చూడలేదని హిట్లర్ రూపంలో ఉన్న కేసీఆర్ ను రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయని ఆరోపించారు. చరిత్ర ఎన్నటికీ మీ అనితిక అహంకార, పిచ్చి చర్యలను మర్చిపోదు అని అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం చేస్తున్న దుర్మార్గాలకు తెలంగాణ రైతులు సైతం బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని విష్ణు వర్ధన్ రెడ్డి సంచలన కామెంట్  లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: