కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటి అయ్యారు.ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటికి ప్రాధన్యత సంతరించుకుంది.అయితే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ది కోసం కేంద్రమంత్రిని కలిసినట్లు కోమటిరెడ్డి తెలిపారు.ఎంతో చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు ఆయన తెలిపారు.దీనికి సంబంధించి వినతిపత్రాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అందించారు.తెలంగాణ వ్యక్తిగా కిషన్‌రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసని ఆయన పేర్కోన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా భువనగిరి కోట అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదన్నారు.నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో కలిసిపోయాయని నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో చరిత్రలో కలిసి పోయాయని..ఇప్పుడు కూడా భవనగిరికోటని పట్టించుకోకపోతే అలాగే అవుతుందని తెలిపారు.కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా భువనగిరి కోటకు నిధులు మంజూరు చేయాలని కోరారు.దీనికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.కోట అభివృద్దికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.