ఇవాళ ఖానామెట్‌లో భూముల వేలం..
గురువారం నాటి కోకాపేట ఈ-వేలానికి భారీ స్పందన వచ్చింది. ప్లాట్లు దక్కించుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటాపోటీగా ధర పెంచుకుంటూ వెళ్లాయి. 1.65 ఎకరాల ప్లాట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. మొత్తం 50 ఎకరాలను అమ్మకానికి పెడితే.. రూ. 2 వేల కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరా రూ. 60 కోట్లు ధర పలికింది. యావరేజ్ మీద ఒక్కో ఎకరం 40 కోట్లు పలికింది.