ఇందిరాపార్క్ వద్ద టెన్షన్.. టెన్షన్..!
పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చౌక్ కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఇందిరా పార్కు ధర్నా చౌక్ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాగైనా ఈ కార్యక్రమం నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే అనుమతి లేనందున అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇందిరా పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.