అసలు కేటీఆర్ ఎవరు...? మహిళలు అంటే ఆయన దృష్టిలో...?: షర్మిల
మహిళలను కెసిఆర్ గౌరవించడం లేదని దళితులకు ఎంతమందికి భూములు ఇచ్చారని షర్మిల నిలదీశారు. అసలు కేటీఆర్ అంటే ఎవరు అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మహిళలకు కెసిఆర్ ఎలాగో గౌరవం ఇవ్వడం లేదని ఇక కేటీఆర్ ఏవిధంగా ఇస్తారని ఆమె నిలదీశారు. టిఆర్ఎస్ లో మహిళలు ఎంత మంది ఉన్నారని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వ్రతాలు చేసుకుని ఇళ్లల్లో ఉండాలి అంటూ షర్మిల కాస్త ఘాటుగా స్పందించారు.