పిలిస్తే పలకనా బా...? తుమ్మలకు కేసీఆర్ ఆహ్వానం...?

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కొంత మంది టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు సీరియస్ గా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై అసహనంగా ఉన్నారని ప్రచారం కాస్త ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇబ్బంది పడి పార్టీలో కొనసాగే పరిస్థితి అయితే దాదాపుగా లేదని చెప్పాలి. ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడానికి చాలామంది నాయకులు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ విషయంలో సీఎం కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పామాయిల్ సాగు విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు కూడా తెలిపారు. త్వరలోనే తుమ్మల నాగేశ్వర రావును సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు ఆహ్వానించారని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖరారు చేసే అవకాశం ఉండవచ్చని వచ్చే నెల మొదటివారంలో వీరి భేటీ జరగనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: