యూరప్ లో ఓ వైపు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. కేసుల సంఖ్య ఇప్పటికీ నమోదవుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుండి బయటపడ్డామని అనుకునేలోపే సెకండ్ వేవ్ వచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. ఇక ఓ వైపు కరోనా ఉంటే మరోవైపు వరదలు ముంచెత్తడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. వాగులు వంకలు పొంగి పొందుతున్న నేపధ్యంలో బెల్జియం, జర్మనీ దేశాల ప్రజలు గజ గజ వనికిపోతున్నారు. మరోవైపు వరదల కారణంగా ఇప్పటికే రెండు వందల మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. అంతేకాకుండా వరదల కారణంగా వందల మంది నీటిలో కొట్టుకు పోయినట్లు తెలుస్తోంది. దాంతో ఆర్మీ మరియు డిజాస్టర్ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపడుతోంది. జర్మనీలో ఈ వరదల ప్రభావం అహల్వార్ కౌంటీ, రైన్ లాండ్ -పలాటి నేట్, నార్ట్ రైన్- వెస్టా ఫాలియా మరికొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది.