మీరు అమెరికా వెళ్లాల‌నుకుంటున్నారా?

Garikapati Rajesh

భార‌త‌దేశంలో కొవిడ్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా రోజురోజుకూ త‌గ్గ‌డంతో విమాన ప్ర‌యాణాల‌పై ఆయా దేశాలు నిబంధ‌న‌లు స‌డ‌లిస్తున్నాయి. తాజాగా అగ్ర‌రాజ్యం అమెరికా భార‌త‌దేశానికి సంబంధించి ప్ర‌యాణాలు చేసే అడ్వైజ‌రీస్థాయిని లెవ‌ల్ 4 నుంచి లెవ‌ల్ 3కి త‌గ్గించింది. లెవ‌ల్ 4 ప్ర‌కారం భార‌త్‌కు ప్ర‌యాణించాలంటే పూర్తిస్థాయి నిషేధం ఉండేది. ఇప్పుడు లెవ‌ల్ 3 వ‌ల్ల ప్ర‌యాణాలు చేయ‌ద‌లిచిన పౌరులు ఆ నిర్ణ‌యాన్ని ఒక‌సారి పునఃప‌రిశీలించాల‌ని కోరే అవ‌కాశం ఉంటుంది.  డెల్టా వేరియంట్ వ్యాప్తితో ప‌లు దేశాలు భార‌త్‌కు రాక‌పోక‌లు నిషేధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కెన‌డా ఆగ‌స్టు 21 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించింది. ఏప్రిల్ 22వ తేదీన భార‌త‌దేశం నుంచి విమానాల‌పై నిషేధం విధించిన కెన‌డా ఇలా పొడిగించ‌డం నాలుగోసారి. రెండోద‌శ‌లో క‌రోనా ఉధృతంగా ఉండ‌టంతో ఇండియా చిగురుటాకులా వ‌ణికిపోయింది. ఆసుప‌త్రుల్లో బెడ్లు దొర‌క్క‌, ఆక్సిజ‌న్ అందుబాటులో లేక రోగుల ఇక్క‌ట్లు వ‌ర్ణ‌నాతీతం. ఇప్పుడు ఇదే డెల్టా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 80 శాతానికి పైగా దేశాల‌కు వ్యాపించిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag

సంబంధిత వార్తలు: