విజ‌య‌సాయిరెడ్డి క్ష‌మాప‌ణ‌లు?

Garikapati Rajesh


రాజ్య సభ డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ నారాయ‌ణ్‌సింగ్‌కు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. స‌భ‌లో ప్ర‌త్యేకహోదాపై చ‌ర్చించేందుకు అనుమ‌తించాల‌ని కోరుతూ వెల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌న తెలియ‌జేసే క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి కాగితాలు చింపి డిప్యూటీ ఛైర్మ‌న్‌పై విసిరేశారు. దీనిపై రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్‌గా నియ‌మితులైన మంత్రి పీయూష్‌గోయ‌ల్ జోక్యం చేసుకున్నారు. దీంతో విజ‌య‌సాయి హ‌రివంశ్ చాంబ‌ర్‌కు వెళ్లి కాగితాలు విసిరివేసినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరిన‌ట్లు తెలిసింది. అయితే స‌భ‌లో జ‌రిగిన విష‌యం కాబ‌ట్టి అక్క‌డే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న కోర‌గా, గురువారం స‌భ‌లో అంద‌రిముందు క్ష‌మాప‌ణ కోర‌తాన‌ని విజ‌యసాయి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై మంగళవారం రాజ్యసభలో వైసీపీ ఆందోళ‌న చేసింది. ఈ క్ర‌మంలో స‌భ కార్యకలాపాలు కొద్దిసేపు స్తంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag

సంబంధిత వార్తలు: