ఏపీ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇక మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దాంతో ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు .
కాపు నేస్తం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం కలెక్టర్లకు ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని చెప్పారు . అంతేకాకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు .