జంట జలాశయాలకు భారీగా వరద నీరు.. !

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఉస్మాన్ సాగర్ గండిపేట గేట్లను అధికారులు ఎత్తారు. సాగర్ ప్రాజెక్ట్ 2 గేట్లను అధికారులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కాకుండా హిమాయత్ సాగర్ 5 గేట్లను ఎత్తి నీటిని అధికారులు మూసీ నదిలోకి పంపుతున్నారు. ఇక భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.


మూసీ పరీవాహక ప్రాంతాలైన శంకర్ నగర్, రసూల్ పురా, మూసారాంబాగ్, చాదర్ ఘాట్ మరియు బస్తీవాసుల ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు జిహెచ్ఎంసి అధికారులు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగింది. దాంతో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రక్షణ చర్యలు చేపడుతున్నాయి. నిర్మల్ నగరంలో చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: