తెలంగాణ బిజెపికి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు పార్టీకి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకువచ్చిన దళిత సాధికారత పథకం దళిత బంధు బిజెపి పార్టీకి మోత్కుపల్లి కి మధ్య చిచ్చుపెట్టింది. సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి హాజరయ్యారు. దాంతో పలువురు బీజేపీ నాయకులు ఆయనపై విమర్శలు కురిపించారు. అప్పటి నుండి మోత్కుపల్లిని పార్టీకి దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
బిజెపిలో సీనియర్ నేత అయినప్పటికీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు. దాంతో మోత్కుపల్లి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. బిజెపికి రాజీనామా చేసి త్వరలో ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లి బిజెపి ని వీడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.