ఆమె పోరాటం ఒక స్ఫూర్తి: పవన్ కళ్యాణ్
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కు నా తరపున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు అని ఒక ప్రకటన విడుదల చేసారు పవన్. ఒలింపిక్స్ లో 20ఏళ్ల తరవాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకం సాధించారు అని అన్నారు. కరణం మల్లీశ్వరి గారి తరవాత మీరాబాయి చాను ఈ రికార్డు సాధించడం గర్వ కారణం అని ఆయన అన్నారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన మీరాబాయి చాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విధం, ఆమెలోని పోరాటపటిమ యువతకు స్ఫూర్తినిస్తాయి అని ఆయన కొనియాడారు.