మేరీ కామ్ 'పంచ్' అదిరింది

Mamatha Reddy
ఇండియన్ నుంచి స్టార్ బాక్స‌ర్ గా టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న మేరీ కోమ్ శుభారంభం చేసింది. 51 కేజీల‌ విభాగం లో బరిలోకి దిగిన మేరీ కోమ్ ఫ్లై వెయిట్ కేట‌గిరీ రౌండ్ ఆఫ్ 32లో విజ‌యం సాధించింది. డొమినికాకు దేశం నుంచి పాల్గొన్న హెర్నాండెజ్ గార్సియా మిగులినాతో పోటీ పడి బౌట్‌లో 4:1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లో ఆదివారం రోజు అడుగు పెట్టింది. ఈ పోటీ లో మేరీ కోమ్ తన ఆధిపత్యాన్ని చూపించి విజయడంకా మోగించింది. టోక్యో లో పథకం కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం తో ఉన్న మేరీ కోమ్ లండన్ లో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ తో సరి పెట్టుకుంది. ఇక ఆ తర్వాత రియో ఒలంపిక్స్ అసలు క్వాలిఫై కాలేకపోయింది. మరి ఈ సారి పథకం గెలవడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: