యడ్డీకి ఎన్నికల సవాల్.. డీకే కుమ్మేస్తున్నాడుగా..!
బీజేపీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదన్నారు శివకుమార్. ప్రజల అవసరాలను తీర్చడంలో యడ్యూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీకే శివకుమార్ విమర్శించారు. ప్రజలను ఎలా కాపాడాలో భారతీయ జనతా పార్టీకి తెలియదని... వారికి పాలించే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదని ఆయన మండిపడ్డారు. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే వీళ్లకు మాత్రం కుర్చీ రాజకీయాలు కావాలా అని ప్రశ్నించారు.