వాలీబాల్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కిన ఎన్టీఆర్

Chaganti
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా వాలీబాల్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కారు. అభిమాని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతవరకూ ఎన్టీఆర్ ఎలాంటి స్పోర్ట్స్ ఆడుతూ కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగతా వాళ్లు కూడా ఈ వైరల్ వీడియోను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే తారక్ వాలీబాల్ ఆడింది ఎక్కడ అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" చిత్రంతో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రీసెంట్ గా "ఆర్ఆర్ఆర్" ప్రమోషనల్ సాంగ్ ను పూర్తి చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ పై ఓ భారీ సాంగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. మరోవైపు జోరుగా ప్రమోషన్లు కొనసాగించే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన ఖాళీ సమయంలో ఎన్టీఆర్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: