దేశంలోనే ఆ సౌకర్యం ఉన్న తొలినగరం పూరి !
ఒడిశా ప్రభుత్వంఇలా పూరీలో ట్యాప్ నుండి నగర వ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన తాగునీటిని అందిస్తూ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. పూరి ఇప్పుడు లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన చేరిందంటోంది ఒడిశా ప్రభుత్వం. ఈ పథకం ద్వారా పూరిలో సుమారు 2.5 లక్షల మంది నివాసితులకు ప్రయోజనం కలుగుతుంది. పూరి మాత్రమే కాదు, మొత్తం ఒడిశా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు ఒడిశా సీఎం. ప్రతి సంవత్సరం పూరీకి వచ్చే రెండు కోట్ల మంది పర్యాటకులకుకూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.