దేశంలో ఐదున్నర లక్షల ఇంజినీరింగ్ సీట్ల మాయం..!

Chakravarthi Kalyan
ఇంజినీరింగ్.. ఇప్పుడు డిగ్రీ కంటే రొటీన్ అయిపోయింది. కాలేజీలు పెరగడంతో ఇంటర్ పూర్తి చేసుకున్న వారిలో చాలా మంది ఇంజినీరింగ్ చేస్తున్నారు. దీంతో దశాబ్దకాలంగా ఇంజినీరింగ్‌ చదవడం బాగా పెరిగింది. అయితే.. తాజాగా దేశంలో మూడేళ్లలో ఐదున్నర లక్షలుపైగా ఇంజినీరింగ్‌ సీట్లు తగ్గిపోయాయట. ఎందుకంటే.. కొన్ని కోర్సులకు డిమాండ్‌ పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాదు..ఆ కోర్సుల్లో ముందు ముందు విద్యార్థులు చేరుతారన్న నమ్మకం కూడా లేదట.


అందుకే ఆ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు తగ్గించేశాయి. ఈ విషయాన్ని  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ఇలా తగ్గిన సీట్లలో ఎక్కువగా ప్రైవేటు కాలేజీల్లోనే తగ్గిపోయాయట. అందుకే వచ్చే ఏడాదికి కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు ఇవ్వరట. ఇంజినీరింగ్ కళాశాలలు తక్కువగా ఉన్న జిల్లాల్లోనే కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇస్తారట. అయితే అత్యధిక ఉద్యోగావకాశాలున్న కోర్సులు ప్రారంభించేందుకు ఏ సంస్థ ముందుకు వచ్చినా అనుమతులు ఇస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: