ఓ ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ముగ్గురు యాంకర్లు తమను వేధిస్తున్నారంటూ ఆఫీస్ సిబ్బంది సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే
. తమ ఫోటోలను వీడీయోలను తీసుకుని యాంకర్లు వేధిస్తున్నారంటూ ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఆశ్రయించారు . కాగా దీనిపై తాజాగా టీవీ9 సంస్థ స్పందించింది . టీవీ9 ఛానల్ లో పనిచేస్తున్న ముగ్గురు యాంకర్స్ మధ్య వివాదం కారణంగా హైదరాబాద్ పోలీసులు డేటా దొంగతనం ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపింది .
సిబ్బంది ప్రవర్తన మరియు ఆరోపించిన నేరంలో వారి పాత్ర పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని కానీ వారి అధికారిక విధులతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది
. పోలీసు దర్యాప్తుకు తాము పూర్తి స్థాయిలో సహాయం చేస్తున్నామని చెప్పింది. అంతర్గత క్రమశిక్షణ విచారణను కూడా తాము ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది .