రాజధానిలో మట్టి దొంగలు

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ శానస రాజధాని అమరావతిలో మట్టి తవ్వకం దార్లు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమనులు లేనప్పటికీ... అర్థరాత్రి సమయంలో నిత్యం వందల ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇదేమని ఎవరైనా అడిగితే వారిపై దాడికి యత్నిస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే రాత్రి కూడా సాండ్ మాఫియా మరోసారి మట్టి తవ్వకాలకు యత్నించింది. విషయం తెలుసుకున్న అమరావతి రైతులు, దళిత జేఏసీ నేతలు అర్థరాత్రి పూట అక్కడికి వెళ్లారు. అయితే రైతులు పెద్ద ఎత్తున రావడం గమనించిన అక్రమార్కులు... అక్కడి నుంచి పారిపోయారు. ట్రాక్టర్లు, జేసీబీలను స్వాధీనం చేసుకున్న రైతులు.... తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఉద్ధండరాయుని పాలెంలో కంకరను అక్రమంగా తరలించారు. ఆ తర్వాత హైకోర్టు సమీపంలోనే ఇసుకను తరలించేశారు. ఇప్పుడు సచివాలయం వెనుక ఉన్న ఈ-6 రోడ్డులోని నల్లమట్టిని తవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు నిఘా ఉన్న ప్రాంతాల్లోనే అక్రమ తవ్వకాలు జరుగుతుంటే... పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రైతులు. రోడ్ పేర్లు తెలియకుండా బోర్డులను పక్కన పడేస్తున్నారని రైతులు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: