గుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్.. ఆరుగురు మృతి

Chakravarthi Kalyan
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యుదాఘాతం ఘటనలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా పనిచేస్తున్న ఆరుగురు ఒడిశా వాసులు మరణించారు. రాత్రి సమయంలో చెరువు గట్టుపై ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


మరణించిన వారిని ఒడిశాకు చెందిన రామ్మూర్తి,  కిరణ్ , మనోజ్ , పండబో, మహేంద్ర, నవీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి వలస జీవితాల్లో విషాదాన్ని గుర్తు చేస్తోంది. పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చి పని చేసే ఒడిశా వాసులు పిట్టల్లా రాలిపోయారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. ఇందులో మరేదైనా కోణం ఉందా అన్న అనుమానంతోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: