బిగ్ బ్రేకింగ్: ఏపీ సర్కార్ కు ఎన్జీటి షాక్...?
అనుమతించిన పరిధి దాటి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగినట్టు గుర్తించింది. తక్షణమే గనుల శాఖ ఆధ్వర్యంలో శాఖ పరమైన విచారణ చేపట్టి అక్రమాలకు అండగా నిలిచిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం సంచలనం అయింది. జరిగిన నష్టానికి బాధ్యులైన అధికారుల నుండి నష్ట పరిహారం వసూలు చెయ్యాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాల పై విచారణ చేపట్టేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేస్తూఆదేశాలు ఇచ్చింది.