ఇద్దరు బాలికలు మిస్సింగ్.. చివరికి బావిలో అలా?
అయితే వీరిద్దరు స్నానానికి దిగినప్పుడు ఎవరూ వీరిద్దరిని చూడలేదు. ఎంతసేపటికి వీరిద్దరూ కనిపించకపోవడంతో గ్రామస్తులు వీరికోసం గాలించగా బావిలో బాలికల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బావిలో నుంచి బాలికల మృతదేహాలను బయటకు తీయించారు. ప్రమాదవశాత్తు బావి లోతుగా ఉండడంతో వారు అందులో మునిగి పోయి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.