ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హరిచందన్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన సమయం నుండి ప్రజా జీవితంలో బిశ్వభూషణ్ ఉన్నారని తెలిపారు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు.
శాసనసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఒడిస్సా ప్రజలకు విశ్వభూషణ్ అందించిన సేవలు కొనియాడదగినవి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన రచయితగా పలు పుస్తకాలను రచించి జాతికి అందించి మార్గదర్శిగా నిలిచారు అని చెప్పారు. ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు రాజకీయాలను మ్యానేజ్ చేస్తున్నారు.