మాలిలో ఘోర ప్రమాదం... 40 మందిపైగా మృతి

Podili Ravindranath
మాలిలోని జాతీయ  మరోసారి రక్తమోడింది. కూలీలతో లారీని... అతివేగంగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 40 మంది మృతి చెందగా... మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 33 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బమాకో పట్టణం నుంచి కూలీలు వలస వెళ్తుంటారు. వీరంతా మాలి మీదుగా లారీలో ప్రయాణిస్తున్నారు. మాలి దాటిన తర్వాత సెగో పట్టణ సమీపంలోకి వస్తున్న సమయంలో లారీ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్నబస్సును బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగంగా పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. లారీలో ఉన్న కూలీలపై సామాన్లు పడటంతో ఊపిర ఆడక 15 మంది మృతి చెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ఆఫ్రికాలోనే దాదాపు 12 శాతం మంది మృతి చెందుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: