బీ అలర్ట్... థర్డ్ వేవ్ కమింగ్.. సెంటర్ వార్నింగ్

Podili Ravindranath
ఆగస్టులో కరోనా మూడో దశ రావొచ్చన్న నిపుణుల హెచ్చరికల మధ్య దేశంలో వైరస్ ఉధృతి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి ఎంతమందికి వైరస్ ను వ్యాపింప చేస్తారు అని లెక్కించే రీ ప్రొడక్షన్ సంఖ్య పెరుగుతూ ఉండటమే దీనికి కారణం. ఇటీవల భారత్ లో 0.88గా ఉన్న ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో రీ ప్రోడక్షన్ రేటు ఒకటి కంటే ఎక్కువ ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో వైరస్ వ్యాప్తి రేటు ఒకటికి చేరువవుతున్నట్లు వెల్లడించింది. జూలై 30 నాటికి దేశంలో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పెరగడం సహా ఆర్ ఫ్యాక్టర్ రేటు  ఒకటి దాటినట్లు యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ అంచనా వేయగా..  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ.. వైరస్ కేసులు పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో అత్యధికంగా 20 వేల కేసులు 24 గంటల్లో నమోదు కావడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: