హైదరబాద్ మ్యాన్ హోల్స్ కు మరో ఇద్దరు బలి.. ,!

హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ శుభ్రం చేస్తుండగా ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సాహెబ్ నగర్ లో డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా మ్యాన్ హోల్ లోకి దిగిన శివ, అనంతయ్య అనే ఇద్దరు గల్లంతయ్యారు. మ్యాన్ హోల్ లోపల ఊపిరాడక అందులోనే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం రావడంతో పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొక మృతదేహం కోసం సహాయక చర్యలు చేపట్టారు. వీరిద్దరూ సరూర్ నగర్, చంపా పేట్  ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.


ఇద్దరూ పారిశుద్ధ్య పనులు చేస్తూ జీవనం గడుపుతారని తెలుస్తోంది. ఈ ఘటనపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఇలాంటి పనులు చేయాలని ఒత్తిడి చేసే కాంట్రాక్టర్లను శిక్షించాలని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని స్థానిక కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మ్యాన్ హోల్ లో పారిశుద్ధ కార్మికులు మరణించడం కొత్తేమీ కాదు. గతంలో అనేక సార్లు పారిశుద్ధ్య  కార్మికులు మ్యాన్ హోల్ శుభ్రం చేస్తుండగా మరణించారు. ప్రభుత్వం కార్మికులకు సరైన భద్రత కల్పించక పోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: