తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈరోజు, రేపు.. !

వారం రోజుల క్రితం వరకు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవగా వారం నుండి ఎండలు మండిపోతున్నాయి. దాంతో పంటల కు నష్టం కలిగే అవకాశం ఉందని రైతులు, ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రుతుపవనాల కదలికల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం 8 గంటల నుండి 8 గంటల వరకు రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


కాగా అత్యధికంగా ములుగు జిల్లాలో వర్షం కురిసింది అని తెలిపింది. ములుగు జిల్లా లోని కాసిం దేవి పేట లో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది. అంతేకాకుండా పశ్చిమ మహా భారతం నుండి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు కు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. దాదాపు అన్ని ప్రాజెక్ట్ లు నిండు కుండలను తలపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: