జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు... మరో ఇద్దరు అరెస్ట్

Podili Ravindranath
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ విచారణ వేగం పెంచింది. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసిన సీబీఐ... తాజాగా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది పి.ఆదర్శ్, ఎల్.సాంబశివారెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. కొండారెడ్డ, సుధీర్ లను జులై 28న అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు జులై 9న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా ఆదర్శ్, సాంబశివారెడ్డి అరెస్ట్ తో మొత్తం ఐదుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాత్రను పరిశీలిస్తున్నామన్నారు సీబీఐ అధికారులు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో 16 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. జడ్జిలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందనే కోణంలో కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: