మోడీ కేసీఆర్ వి ఫాసిస్ట్ విధానాలు : రేవంత్ ఫైర్

కాంగ్రెస్ పాలన కాలంలో దేశం ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా నిలబడిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చి స్వేచ్ఛ వాయువులను ఇచ్చింది కాంగ్రేస్ యేన‌ని అన్నారు. కానీ నరేంద్ర మోడీ పాలనలో దేశాన్ని ఆదానీ, అంబానీలకు తాకట్టు పెట్టాడంటూ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోదీ వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి దేశంలో రైతుల నడ్డి విరుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్ర‌ధాని మోడీ సర్కార్ దేశంలో సామాన్యుల నడ్డి విరుస్తుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. 


తెల్లదొరల ఫాసిస్ట్ విధానాలను దేశంలో నరేంద్ర మోడీ...మ‌న‌ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోడీ కేసీఆర్ ల ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ఆశయాలు నెరవేరాలని సోనియా తెలంగాణ ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో  బడుగు బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో మోడీ రాష్ట్రంలో మ‌రియు కేసీఆర్ గద్దె దిగితేనే సామాన్య ప్రజలకు మేలు జ‌రుగుతుంద‌ని  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: