ఎందుకు లేట్ అవుతుంది...? ఏపీ హైకోర్ట్ ఫైర్...?
ఎక్కువ కేసులు లేకపోవటంతో ట్రిబ్యునల్ వేయలేదని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపించారు. జిల్లా కోర్టులకు ఎన్నికల పిటిషన్లను విచారించాలని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన అడ్వకేట్ జనరల్... నోటిఫికేషన్ను హైకోర్టు ఆమోదించాలని విజ్ఞప్తి చేసారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకు పది రోజుల సమయం పడుతుందని అడ్వకేట్ జనరల్ హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్రంలో ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించి సరైన న్యాయం జరగడం లేదనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చిన సంగతి తెలిసిందే.